Telugu Global
Cinema & Entertainment

Maruti Nagar Subramanyam - రావు రమేష్ హీరోగా సినిమా

Rao Ramesh Maruti Nagar Subramanyam Movie - రావురమేష్ హీరోగా మారారు. మారుతినగర్ సుబ్రమణ్యం అనే సినిమాలో నటిస్తున్నారు.

Maruti Nagar Subramanyam - రావు రమేష్ హీరోగా సినిమా
X

కథలో ముందుండి, కథను ముందుకు నడిపించే వ్యక్తిని హీరో అంటాం. విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి అలా హీరోగా మారారు. అయితే ఆయన పోషించబోయేది రెగ్యులర్ హీరో రోల్ కాదు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు కంటెంట్ బేస్డ్ సినిమాలను ఆదరిస్తున్నారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా, రాజ్ కుమార్ రావు, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి యాక్టర్స్ చేసే సినిమాల తరహాలో ఈ సినిమా ఉండబోతోంది.

రావు రమేష్ టైటిల్ పాత్రలో పీబీఆర్ సినిమాస్ సంస్థ రూపొందిస్తున్న సినిమా 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం'. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీస్ 'పుష్ప', 'కెజియఫ్', 'ధమాకా' తర్వాత ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్న చిత్రమిది. ఇందులో నటి ఇంద్రజ కీలక పాత్రధారి. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు.

వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. నడి వయసులో ఉన్న ఒక మధ్య తరగతి నిరుద్యోగి జీవితంలో క్షణ క్షణం జరిగే ట్విస్టులతో 2 గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

First Published:  25 Feb 2023 3:32 PM GMT
Next Story