Telugu Global
Cinema & Entertainment

Vaarasudu: రంజితమే సాంగ్ రిలీజ్

Ranjithame Song: విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా వారసుడు. ఈ సినిమా నుంచి రంజితమే అనే తెలుగు సాంగ్ ను విడుదల చేశారు.

Vaarasudu: రంజితమే సాంగ్ రిలీజ్
X

తమిళ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి క్రేజీ కాంబినేషన్‌ లో వస్తున్న సినిమా వారసుడు. సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండి ఫస్ట్ లుక్ తో పాటు ఇతర పోస్టర్‌ లు.. ఇలా ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ రంజితమే తమిళ్ లో చార్ట్ బస్టర్ గా నిలిచింది. 75 మిలియన్ + వ్యూస్ ని క్రాస్ చేసి సెన్సేషనల్ హిట్ అయింది. తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్‌ ను విడుదల చేశారు.

బ్లాక్ బస్టర్ కంపోజర్ తమన్ ఈ పాటని మాస్ నంబర్‌ గా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. అనురాగ్ కులకర్ణి, మానసి కలిసి ఆలపించారు. పాటలో విజయ్, రష్మిక ల కెమిస్ట్రీ, కాస్ట్యుమ్స్, డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి.

రామజోగయ్య శాస్త్రి అందించిన క్యాచీ లిరిక్స్ తెలుగు వెర్షన్‌ కి ఫ్రెష్ నెస్ తెచ్చిపెట్టింది. తమిళ్ పాటలానే తెలుగు వెర్షన్ కూడా పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.

ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్, పీవీపీ నిర్మిస్తున్నారు. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, సంగీత, ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వారసుడు/వారిసు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.



First Published:  1 Dec 2022 4:01 AM GMT
Next Story