Telugu Global
Cinema & Entertainment

రంగ రంగ వైభవంగా ట్రయిలర్ రివ్యూ

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రంగరంగ వైభవంగా. ఈ సినిమా ట్రయిలర్ ఈరోజు రిలీజైంది. ఆ ట్రయిలర్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..

రంగ రంగ వైభవంగా ట్రయిలర్ రివ్యూ
X

వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇన్నాళ్లూ సాంగ్స్ తో, టీజర్ తో హల్ చల్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఈరోజు థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేశారు. అదే రంగరంగ వైభవంగా మూవీ. గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈరోజు రిలీజైన ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.

టైటిల్ కు తగ్గట్టే ట్రయిలర్ రంగరంగ వైభవంగా ఉంది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ వాల్యూస్ ట్రయిలర్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక కంటెంట్ విషయానికొస్తే.. హీరోహీరోయిన్లు ఇగో సమస్యలతో ఉంటారనే విషయాన్ని టీజర్ లోనే వివరించారు. ఇప్పుడు అదే విషయాన్ని ట్రయిలర్ లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మరీ ముఖ్యంగా స్కూల్ డేస్ నుంచే హీరోహీరోయిన్ల మధ్య ఇగోలు, గొడవలు మొదలైన విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. ఇలా ఇగోలతో ఇబ్బంది పడే ఓ జంట, ఎలా ఒక్కటైందనేదే ఈ సినిమా స్టోరీ.

ట్రయిలర్ లో హీరోహీరోయిన్లతో పాటు కీలకమైన నటీనటులందర్నీ పరిచయం చేశారు. యూత్ ఐకాన్ గా వైష్ణవ్ తేజ్ చాలా ఈజ్ తో, ఎనర్జిటిక్ గా నటించాడు. క్లయిమాక్స్ లో చిరంజీవి, పవన్ కల్యాణ్ ను కలిపి ఇమిటేట్ చేసే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ కేతిక శర్మ చాలా అందంగా, గ్లామరస్ గా ఉంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 2న థియేటర్లలోకి వస్తోంది రంగరంగ వైభవంగా సినిమా.



First Published:  23 Aug 2022 3:11 PM GMT
Next Story