Telugu Global
Cinema & Entertainment

Animal Movie Trailer Review | రణబీర్ కపూర్ యానిమల్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!

Animal Telugu Movie Trailer Review | రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతోంది యానిమల్ సినిమా. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

Animal Movie Trailer Review | రణబీర్ కపూర్ యానిమల్ ట్రయిలర్ ఎలా ఉందంటే..!
X

Animal Movie Trailer Review | రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ సాగా 'యానిమల్'. ఈ సినిమా టీజర్ తో సంచలనం సృష్టించింది. ఈరోజు యానిమల్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

రణబీర్ కపూర్, తన తండ్రి పాత్ర పోషించిన అనిల్ కపూర్ తో తను చిన్నపిల్లాడిగా ఉన్నపుడు జరిగిన ఓ సంఘటన చెబుతూ..ఇప్పుడు చిన్నప్పటి తనలా యాక్ట్ చేయమని తండ్రిని అడిగే ఓ ఇంటెన్స్ సీన్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సన్నివేశం తండ్రి-కొడుకుల కాంప్లెక్స్ రిలేషన్ ను ఎలివేట్ చేసింది.

అనిల్ కపూర్ ను గుర్తు తెలియని వ్యక్తి కాల్చేస్తాడు. రణబీర్ తన తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు, రణబీర్, బాబీ డియోల్ మధ్య యుద్ధం మొదలవుతుంది.

రణబీర్ కపూర్ తన నట విశ్వరూపం చూపించాడు. యువకుడు, భర్త, ప్రతీకారం తీర్చుకునే కొడుడు ఇలా చాలా కోణాలున్న పాత్రలో రణబీర్ కపూర్ బ్రిలియంట్ గా నటించాడు. అనిల్ కపూర్ తండ్రి పాత్రలో ఎక్స్ ట్రార్డినరీ గా చేశాడు. రష్మిక రణబీర్ భార్యగా తన పాత్రలో ఒదిగిపోయింది.

డైలాగ్స్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. దిల్ రాజు, తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తున్నాడు.

First Published:  23 Nov 2023 5:18 PM GMT
Next Story