Telugu Global
Cinema & Entertainment

Rana Naidu | రానా నాయుడుకు రంగం సిద్ధం

Rana Naidu - వివాదాస్పద రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్-2 రెడీ అవుతోంది. జనవరి నుంచి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

Rana Naidu | రానా నాయుడుకు రంగం సిద్ధం
X

రానా నాయుడు.. వెంకటేష్ ను యూత్ కు దగ్గర చేసిన వెబ్ సిరీస్ ఇది. ఈ సిరీస్ లో వెంకీని చూసి పెద్దోళ్లు కామెంట్ చేస్తే, కుర్రాళ్లు మాత్రం పండగ చేసుకున్నారు. ఫ్యామిలీ హీరో ఇలా బోల్డ్ గా నటించడం చాలా మందికి నచ్చలేదనే విమర్శలు వచ్చాయి. ఇలా ఎన్నో ప్రశంసలు, మరెన్నో విమర్శల మధ్య రానా నాయుడు హంగామా ముగిసింది.

ఇప్పుడీ వెబ్ సిరీస్ సీజన్-2 రాబోతోంది. జనవరి నుంచి రానా నాయుడు సీజన్-2 షూటింగ్ లో పాల్గొంటున్నట్టు ప్రకటించాడు వెంకటేష్. కొత్త ఏడాదిలో మరోసారి నాగ పాత్రలోకి ప్రవేశిస్తున్నానని, ఈసారి మాత్రం జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపాడు. సీజన్-1తో వచ్చిన విమర్శల్ని దృష్టిలో పెట్టుకొని, సీజన్-2లో తన పాత్ర, డైలాగులు కాస్త పద్ధతిగా ఉండేలా జాగ్రత్త పడ్డానని అంటున్నాడు వెంకీ. అదే టైమ్ లో నాగా నాయుడులో ఉండే కొంటెతనం కూడా కనిపిస్తుందని చెబుతున్నాడు.

వెంకీ-రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన వెబ్ సిరీస్ పై చాలా విమర్శలొచ్చాయి. ఒక దశలో ఇది వివాదాస్పదమైంది కూడా. దీంతో ఈ సిరీస్ తెలుగు వెర్షన్ ను కొన్ని రోజుల పాటు ఆపేసింది సదరు ఓటీటీ సంస్థ. అలా ఎన్నో వివాదాలకు కేంద్రమైన ఈ సిరీస్, ఇప్పుడు సీజన్-2తో మరోసారి ప్రేక్షకులముందుకు రాబోతోంది.

First Published:  22 Nov 2023 5:15 PM GMT
Next Story