Telugu Global
Cinema & Entertainment

HiranyaKasyapa | క్లారిటీ ఇచ్చిన రానా

HiranyaKasyapa | హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ లో త్రివిక్రమ్ పాత్ర ఎంత? దీనిపై రానా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

HiranyaKasyapa | క్లారిటీ ఇచ్చిన రానా
X

శాన్ డియాగాలో జరిగిన కామిక్ కాన్ వేదికపై హిరణ్య కశ్యప ప్రాజెక్టును ఘనంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమా విశేషాల్ని హీరో రానా స్వయంగా వెల్లడించాడు. ఈ క్రమంలో ఓ కీలకమైన అంశంపై విస్ఫష్టంగా ప్రకటన చేశాడు ఈ దగ్గుబాటి హీరో.

గుణశేఖర్ చేయాల్సిన ప్రాజెక్టు, త్రివిక్రమ్ చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో హిరణ్యకశ్యప ప్రాజెక్టును త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ ఈ సినిమాను డైరక్ట్ చేయడం లేదు.

హిరణ్యకశ్యప ప్రాజెక్టుకు త్రివిక్రమ్, కేవలం డైలాగ్స్, స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తున్నారు. మరో దర్శకుడు ఈ భారీ బడ్జెట్ ను డైరక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించాడు. దీంతో ఇన్నాళ్లూ ఈ సినిమాపై ఉన్న సస్పెన్స్ కు తెరపడింది.

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ మూవీ తర్వాత ఆయన బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్తారు. అంతేతప్ప, హిరణ్యకశ్యప ప్రాజెక్టును ఆయన హ్యాండిల్ చేయడం లేదు. బ్రో, భీమ్లానాయక్ సినిమాల టైపులో హిరణ్యకశ్యప ప్రాజెక్టుకు కూడా ఆయన స్క్రీన్ ప్లే-డైలాగ్స్ మాత్రమే అందిస్తారు.

First Published:  23 July 2023 7:07 AM GMT
Next Story