Telugu Global
Cinema & Entertainment

HiranyaKasyapa | ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రకటించిన రానా

HiranyaKasyapa - ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్టు, హిరణ్యకశ్యపను ఎనౌన్స్ చేశాడు రానా. కామిక్ కాన్ లో ఘనంగా పోస్టర్ రిలీజైంది.

HiranyaKasyapa | ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రకటించిన రానా
X

హీరో రానా దగ్గుబాటి శాండియాగోలో జరుగుతున్న కామిక్‌ కాన్‌ ఈవెంట్ వేదికగా తన కొత్త చిత్రం ‘హిరణ్యకశ్యప’ని అనౌన్స్ చేశాడు. తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్‌ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబోతన్నాడు.

ఇందులో రాక్షసరాజు హిరణ్యకశిపునిగా రానా టైటిల్ రోల్ లో కనిపించనున్నాడు. మాటల మాంత్రికుడు, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. రానాకు ఇది డ్రీమ్ ప్రాజెక్టు.

ఈ ప్రాజెక్ట్ గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. “ఈ టైమ్‌లెస్ లెజెండ్స్ కథను ప్రేక్షకులతో పంచుకోవడం నాకు గౌరవంగా ఉంది. ఈ అద్భుతమైన కథనాన్ని రూపొందించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ఎక్సయిమెంట్ ని బిగ్ స్క్రీన్ పైకి తీసుకురావడం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము'' అన్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశిప ప్రాజెక్టు చేయాలని ముందుగా భావించారు. కానీ గుణశేఖర్ అందించిన స్క్రిప్ట్, సురేష్ బాబుకు నచ్చలేదంట. అదే టైమ్ లో అనుకోకుండా, త్రివిక్రమ్ తో ఈ సినిమా గురించి చర్చించడం, ఆయన నెక్ట్స్ లెవెల్ లో నెరేషన్ ఇవ్వడంతో.. ప్రాజెక్టు చేతులు మారిందని అంటారు

First Published:  21 July 2023 10:57 AM GMT
Next Story