Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu - మహేష్ సినిమాలో రమ్యకృష్ణ

RamyaKrishna Mahesh - మహేష్-త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణకు చోటు దక్కింది. పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనుంది.

Mahesh Babu - మహేష్ సినిమాలో రమ్యకృష్ణ
X

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి రమ్యకృష్ణ ఎంటరైంది. చాన్నాళ్ల కిందటే రమ్యకృష్ణకు కథ వినిపించాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆమె తాజాగా ఓకే చెప్పింది.

గతంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ. కిరాయి గూండా, సూపర్ మొగడు, మానవుడు-దానవుడు లాంటి సినిమాల్లో కృష్ణ, రమ్యకృష్ణ కలిసి నటించారు. అయితే మహేష్ బాబుతో కలిసి నటించే అవకాశం మాత్రం ఆమెకు రాలేదు. ఇన్నాళ్లకు త్రివిక్రమ్ సినిమాతో అది నెరవేరనుంది.

నిజానికి గతంలో మహేష్ నటించిన ఓ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది రమ్యకృష్ణ. నాని సినిమా కోసం ఆ ఐటెంసాంగ్ తీశారు. కానీ ఆఖరి నిమిషంలో సినిమా నుంచి ఆ పాట తీసేశారు. అలా మహేష్ తో కలిసి స్క్రీన్ పైకి రాలేకపోయిన రమ్యకృష్ణ, ఎట్టకేలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూవీలో నటించబోతోంది.

హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ బంగ్లా సెట్ వేశారు. రేపట్నుంచి ఆ సెట్ లో షూటింగ్ ఉంది. మహేష్ బాబు జాయిన్ అవుతున్నాడు. రమ్యకృష్ణ వస్తుందా రాదా అనేది క్లారిటీ లేదు.

First Published:  26 Feb 2023 3:41 PM GMT
Next Story