Telugu Global
Cinema & Entertainment

RamLaxman | టైగర్ నాగేశ్వరరావులో ఆ ఎపిసోడ్ సూపర్ అంట!

RamLaxman - టైగర్ నాగేశ్వరరావు సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ పాన్ ఇండియా లెవెల్లో వచ్చాయంటున్నారు ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్

RamLaxman | టైగర్ నాగేశ్వరరావులో ఆ ఎపిసోడ్ సూపర్ అంట!
X

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్ అగర్వాల్ కలిసి చేస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్. గ్రిప్పింగ్ టీజర్ తో ఇప్పటికే మంచి బజ్ అందుకుంది ఈ సినిమా. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపధ్యంలో ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

"టైగర్ నాగేశ్వరరావు జీవితంలో ఊహకు అందని కొన్ని విషయాలు ఉన్నాయి. అప్పట్లో ట్రైన్ , బస్సు .. స్టువర్టుపురం దాటే వరకూ ఒక భయం ఉండేది. ఆయన రన్నింగ్ ట్రైన్ ఎక్కేవారు. ఇందులో యాక్షన్ ని డిజైన్ చేయడంలో రవితేజ ఎంతో సహకరించారు. రవితేజ యాక్షన్ లో ఎక్కడా రాజీపడలేదు. రియలిస్టిక్ గా యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. యాక్షన్ కోసం చాలా కష్టపడ్డాం. ఇంత పవర్ ఫుల్ బయోపిక్ తీసిన దర్శకుడు వంశీకి థాంక్స్ చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో రవితేజ సినిమా వెళ్ళబోతుంది. తప్పకుండా టైగర్ నాగేశ్వరరావు అందరినీ అలరిస్తుంది."

ఇలా టైగర్ నాగేశ్వరరావులో ట్రయిన్ ఫైట్ ఎపిసోడ్ గురించి గొప్పగా చెప్పారు రామ్-లక్ష్మణ్. టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ బాడీ లాంగ్వేజ్ బాగా సూట్ అయిందంటున్నారు. ఆయన ఫిట్ నెస్ కూడా చాలా బాగుందని, చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని అంటున్నారు.

First Published:  3 Oct 2023 5:29 PM GMT
Next Story