Telugu Global
Cinema & Entertainment

Ramcharan - డాన్స్ పవర్ చూపించిన చరణ్

Ramcharn - శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో సాంగ్స్ ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా చరణ్ డాన్స్ స్పెషల్ ఎట్రాక్షన్.

Ramcharan - డాన్స్ పవర్ చూపించిన చరణ్
X

ఒకప్పుడు డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్. ఆ తర్వాత చాలామంది వచ్చారు. అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, సుధీర్ బాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే డాన్స్ చేసే హీరోలు చాలామంది ఉన్నారు. కానీ ఈ విషయంలో కూడా చిరంజీవి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు రామ్ చరణ్.

యాక్టింగ్ తో పాటు డాన్స్ లో కూడా బెస్ట్ అనిపించుకున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే ఎన్నోసార్లు తన డాన్సింగ్ టాలెంట్ చూపించిన ఈ హీరో, ఇప్పుడు మరోసారి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశాడు. చరణ్ డాన్స్ చూసి యూనిట్ లో అంతా ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇంకా పేరుపెట్టని ఈ సినిమా కు సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సాంగ్ షూటింగ్ లో తన డాన్స్ తో యూనిట్ ను ఆశ్చర్యపరిచాడు చెర్రీ. 80 సెకెన్ల లెంగ్త్ ఉండే డాన్స్ మూమెంట్ ను, సింగిల్ టేక్ లో వేసి షాకిచ్చాడు.

చరణ్ చేసిన ఈ మూమెంట్ కు అంతా ఫిదా అయ్యారు. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  16 Feb 2023 3:58 AM GMT
Next Story