Telugu Global
Cinema & Entertainment

Ram Charan: నాటు నాటు తర్వాత మళ్లీ అంత ఎనర్జీ

Ram Charan: సల్మాన్ సినిమాలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం చాలా బాగుందంటున్నాడు చరణ్. నాటు నాటు తర్వాత అంత ఊపు వచ్చిందంటున్నాడు.

Ram Charan Lungi Dance With Salman Khan and Venkatesh: Kisi Ka Bhai Kisi Ki Jaan
X

Ram Charan - సల్మాన్-వెంకటేష్ తో చరణ్ డాన్స్

‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో అతిథి పాత్రలో రామ్ చ‌ర‌ణ్ తళుక్కున్న మెరిసిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ఏంట‌మ్మా అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి కూడా తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్‌, వెంక‌టేష్‌లతో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ చేసిన డాన్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రిలీజైన 2 రోజుల్లోనే ఈ సాంగ్, అన్ని సామాజిక మాధ్య‌మాల్లో క‌లిపి 43 మిలియన్స్‌కు పైగా వ్యూస్‌ సాధించింది.

ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట గురించి చరణ్, తన మ‌న‌సులో మాట‌ను తెలియ‌జేశాడు. ఏంట‌మ్మా సాంగ్‌ను చేసేట‌ప్పుడు తెగ ఎంజాయ్ చేశాన‌ని, అంద‌రం క‌లిసి అద‌ర గొట్టేశామ‌ని అన్నాడు.

ఇద్ద‌రు పెద్ద స్టార్ హీరోల‌తో క‌లిసి తాను ఏంటమ్మా సాంగ్‌లో న‌టించటం క‌ల నిజ‌మైన‌ట్లుగా ఉంద‌ని, మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెబుతూ , ఈ పాటను వెండితెరపై చూసినప్పుడు ఫ్యాన్స్‌కి పండ‌గ‌లా ఉంటుంద‌ని అంటున్నాడు.

ఏంట‌మ్మా సాంగ్‌కు పాయ‌ల్ దేవ్ సంగీత సార‌థ్యం వ‌హించగా జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఈ చిత్రం ఈద్ సంద‌ర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ అవుతుంది.

Next Story