Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ క్లూజివ్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చరణ్ సినిమా

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్నసినిమాను సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడా సినిమా పోస్ట్ పోన్ అయింది.

ఎక్స్ క్లూజివ్.. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చరణ్ సినిమా
X

సంక్రాంతికి ఇప్పటికే కొన్ని సినిమాలు సిద్ధమయ్యాయి. తమ సినిమా సంక్రాంతికి రాబోతోందంటూ ప్రకటనలు కూడా వచ్చాయి. చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాను సంక్రాంతికే అనుకుంటున్నారు. ఇక విజయ్ నటిస్తున్న వారసుడు, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాలు కూడా సంక్రాంతికే అనుకుంటున్నారు. వీటి అన్నింటికంటే ముందే ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

ఇలా పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి వస్తుంటే, రామ్ చరణ్ సినిమా మాత్రం రేసు నుంచి తప్పుకుంది. అవును.. మొన్నటివరకు ఈ సినిమాను సంక్రాంతి టార్గెట్ గా షూటింగ్ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సంక్రాంతికి సినిమాను రెడీ చేయలేమని దిల్ రాజుకు అర్థమైపోయింది. దీంతో సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించారు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. రామ్ చరణ్, కియరా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాకు సంబంధించి గ్యాప్ లేకుండా షెడ్యూల్స్ చేస్తున్నప్పటికీ, ఇంకా చాలా వర్కింగ్ డేస్ అవసరం పడుతున్నాయట. పైగా క్లయిమాక్స్ షూటింగ్ కోసం శంకర్ ఏకంగా నెల రోజులు టైమ్ కోరినట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి డెడ్ లైన్ ను అందుకోవడం కష్టమని భావించి, ఇలా ముందుగానే తప్పుకున్నారు.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు. అటు మహేష్-త్రివిక్రమ్ సినిమాను కూడా వచ్చే ఏడాది సమ్మర్ కే అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రెండు సినిమాలు సమ్మర్ బరిలో పోటీపడతాయి.

First Published:  27 July 2022 12:15 PM GMT
Next Story