Telugu Global
Cinema & Entertainment

Game Changer | మరో 10 రోజుల్లో పూర్తి

Ram Charan's Game Changer Update: గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అప్ డేట్ చెక్ చేద్దాం..

Game Changer | మరో 10 రోజుల్లో పూర్తి
X

రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా కోసం మూడేళ్లకు పైగా పనిచేస్తున్నాడు చరణ్. ఈ భారీ పాన్-ఇండియన్ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్‌కి సంబంధించిన మిగిలిన భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దర్శకుడు శంకర్ నిర్ణయించుకున్నాడు.

మరో 10 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ పాల్గొనాల్సి ఉంది. జూన్‌లో ఈ పని పూర్తి చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు. రామ్ చరణ్ భాగాన్ని ముగించిన తర్వాత, శంకర్ ఇతర సన్నివేశాలను చిత్రీకరిస్తాడు.

‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్‌జే సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి, బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు చరణ్. అందుకే గేమ్ ఛేంజర్ ను ఈనెలలో పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు.

First Published:  3 Jun 2024 5:09 PM GMT
Next Story