Telugu Global
Cinema & Entertainment

Game Changer | రామ్ చరణ్ సినిమాపై త్వరలోనే క్లారిటీ

Game Changer - శంకర్-చరణ్ కాంబోలో వస్తోంది గేమ్ ఛేంజర్. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించబోతున్నారు.

Game Changer | రామ్ చరణ్ సినిమాపై త్వరలోనే క్లారిటీ
X

స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు కెరీర్ లో నిర్మాతగా 50వ సినిమా ఇది. ఈ సినిమా విడుదల తేదీపై చాలా సందిగ్దత ఉంది. అయినప్పటికీ దిల్ రాజు చూచాయగా రిలీజ్ పై స్పందించాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది దసరాకు గేమ్ ఛేంజర్ వస్తుందన్నాడు.

ఇప్పుడీ అంశంపై మరింత క్లారిటీ రాబోతోంది. త్వరలోనే గేమ్ ఛేంజర్ డేట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ మేరకు తెరవెనక పనులు చురుగ్గా సాగుతున్నాయి.

గేమ్ ఛేంజర్ తో పాటు భారతీయుడు-2 సినిమా తీస్తున్నాడు శంకర్. ఒప్పందం ప్రకారం, ఆ సినిమా ముందుగా రిలీజ్ అవ్వాలి. భారతీయుడు-2 సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు. మరో 3 రోజుల్లో ప్రకటించబోతున్నారు. ఆ డేట్ వచ్చిన వెంటనే, గేమ్ ఛేంజర్ డేట్ కూడా ఇవ్వాలనేది దిల్ రాజు ఆలోచన.

తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి వస్తుంది. కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  22 Jan 2024 5:23 PM GMT
Next Story