Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar | తండ్రి సినిమాకు కొడుకు ప్రచారం

Bholaa Shankar - చిరంజీవి హీరోగా నటించిన సినిమా భోళాశంకర్. ఇప్పుడీ సినిమా ట్రయిలర్ ను రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నాడు. రేపే ముహూర్తం.

Bholaa Shankar | తండ్రి సినిమాకు కొడుకు ప్రచారం
X

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్‌ రమేష్‌ ఈ సినిమాకు దర్శకుడు. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు అధికారిక రీమేక్ ఇది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్‌ నుంచి పాటల వరకు ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది.

ఈ క్రమంలో రేపు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. తండ్రి నటిస్తున్న సినిమా ట్రయిలర్ ను, కొడుకు రిలీజ్ చేయడం అదనపు ఆకర్షణగా నిలిచింది.

తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్న నటిస్తోంది. అయితే సినిమా కథ మాత్రం ఎక్కువగా కీర్తిసురేష్ చుట్టూ తిరుగుతుంది. తమిళ్ వేదాళం చూసిన వాళ్లకు ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను, వచ్చేనెల 11న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

First Published:  26 July 2023 1:41 PM GMT
Next Story