Telugu Global
Cinema & Entertainment

Ram Charan: హీరో రామ్ చరణ్ నుంచి మరో బ్యానర్

Ram Charan new production house: కొణెదల ప్రొడక్షన్స్ కాకుండా, రామ్ చరణ్ కొత్తగా మరో బ్యానర్ స్థాపించాడు. ఎందుకు?

Ram Charan: హీరో రామ్ చరణ్ నుంచి మరో బ్యానర్
X

రామ్ చరణ్ కు ఇప్పటికే ఓ బ్యానర్ ఉంది. కొణెదల ప్రొడక్షన్స్ వ్యవహారాలన్నింటినీ చరణే చూసుకుంటాడు. ఇప్పుడీ హీరో మరో బ్యానర్ స్థాపించాడు. యువీ క్రియేష‌న్స్‌లోని త‌న ఫ్రెండ్ విక్ర‌మ్ రెడ్డితో కలిసి కొత్త బ్యానర్ స్టార్ట్ చేశాడు చరణ్. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను, యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వీరిద్దరూ ‘వి మెగా పిక్చర్స్’ అనే బ్యానర్‌ను ప్రారంభించారు.

పాన్ ఇండియా ప్రేక్ష‌కులు మెచ్చేలా విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను ఈ సంస్థ రూపొందించ‌నుంది. అదే స‌మ‌యంలో యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయ‌టానికి వేదిక‌గా మారుతుంది ఈ కొత్త బ్యానర్. రామ్ చరణ్, యూవీ విక్రమ్ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. తన సొంత పనులు కూడా పక్కనపెట్టి, రామ్ చరణ్ కోసం వర్క్ చేస్తుంటాడు విక్రమ్. అటు చరణ్ కూడా విక్రమ్ కు మంచి వెయిట్ ఇస్తాడు. అలా ఈ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఇప్పుడు కొత్త బ్యానర్ పెట్టారు.

వి మెగా పిక్చర్స్’ బ్యానర్ పై విలక్ష‌ణ‌మైన ఆలోచనలను ఆవిష్క‌రిస్తూ స‌రికొత్త‌ సినిమాలు నిర్మిస్తామని ప్రకటించాడు చరణ్. కొత్త టాలెంట్ ను పరిచయం చేయడం కోసమే ఈ బ్యానర్ పెట్టినట్టు స్పష్టం చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో చిన్న సినిమాల హవా నడుస్తోంది. తమ దగ్గర ఉన్న పెద్ద బ్యానర్లపై ఇలాంటి చిన్న సినిమాలు తీయలేరు నిర్మాతలు.

అందుకే అల్లు అరవింద్ గీతాఆర్ట్స్-2 అనే కొత్త బ్యానర్ పెట్టారు. దిల్ రాజు తన పేరుమీద దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టారు. ఇక యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ కూడా అందుకే వెలిసింది. ఇప్పుడు చరణ్ కూడా చిన్న సినిమాలు తీసేందుకు, వి మెగా పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టాడు.

Next Story