Telugu Global
Cinema & Entertainment

Ramcharan Sukumar | రంగస్థలం కాంబో రిపీట్

Ramcharan Sukumar - రంగస్థలం కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది. ఈ ఏడాదిలోనే చరణ్-సుక్కూ సెట్స్ పైకి వెళ్లబోతున్నారు.

Ramcharan Sukumar | రంగస్థలం కాంబో రిపీట్
X

వెండితెరపై అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్న రంగ‌స్థలం కాంబినేష‌న్ రిపీట్ అయింది. మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ప్రక‌ట‌న రానే వ‌చ్చింది. గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, సుకుమార్ ద‌ర్శక‌త్వంలో మైత్రీ మూవీస్ మేక‌ర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని ప్రకటించింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ సహ-నిర్మాతగా వ్యవహరించనుంది.

ఈ సినిమా కోసం మరో అద్భుతమైన కథను సిద్ధం చేశాడు సుకుమార్. ఈ విషయాన్ని దాదాపు రెండేళ్ల కిందటే రాజమౌళి వెల్లడించాడు. సుకుమార్ తో రామ్ చరణ్ చేయబోయే సినిమా కథ తనకు తెలుసని, ఆ సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుందని కూడా హింట్ ఇచ్చాడు. అప్పట్నుంచి వెయిట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను ఇన్నాళ్లకు ప్రకటించారు.

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత గ్లోబ‌ల్ స్టార్ అయ్యాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇటు పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరక్టర్ అయ్యాడు సుకుమార్‌. వీరిద్దరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కనున్న ఈ సినిమా మీద దేశవ్యాప్తంగా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. వాట‌న్నిటినీ అందుకునేలా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు సుకుమార్‌.

సినిమా షూటింగ్ ను ఈ ఏడాదిలోనే మొద‌లుపెడ‌తారు. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో సినిమాను విడుద‌ల చేయాలనేది టార్గెట్. సుకుమార్ సినిమాకు రెగ్యులర్ గా పనిచేసే దేవిశ్రీ ప్రసాద్, ఈ సినిమాకు కూడా సంగీతం అందించబోతున్నాడు. హీరోయిన్ తో పాటు, టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  25 March 2024 5:37 PM GMT
Next Story