Telugu Global
Cinema & Entertainment

జపాన్ లో ఆర్ఆర్ఆర్ త్రయం హంగామా

రాంచరణ్, తారక్, రాజమౌళి మరోసారి కలిశారు, జపాన్ లో RRR కు ప్రచారం చేస్తున్నారు

జపాన్ లో ఆర్ఆర్ఆర్ త్రయం హంగామా
X

జపాన్ లో ఆర్ఆర్ఆర్ త్రయం హంగామా బాక్సాఫీస్ దగ్గర విజయఢంకా మోగించి బిగ్గెస్ట్ హిట్ అనిపించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా, జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లారు. ప్రస్తుతం అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఇంటర్వూస్ ఇస్తున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ కూడా వేశారు.


రాజమౌళి సినిమాలకు జపాన్ లో భారీ మార్కెట్ ఉంది. ఆయన గత సినిమాలు ఈగ, బాహుబలి, బాహుబలి-2 సినిమాలు అక్కడ బాగా ఆడాయి. మరీముఖ్యంగా బాహుబలి ఫ్రాంచైజీ కి అక్కడ బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ లో బాహుబలి ఫ్రాంచైజీ ఎవరూ ఊహించని రేంజ్ కలెక్షన్స్ అందుకొని బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.


దీంతో రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ పై కూడా భారీ అంచనాలున్నాయి. 'నాటు నాటు' సాంగ్ ఇప్పటికే జపాన్ లో బాగా రీచ్ అయ్యింది. సోషల్ మీడియా ద్వారా ఇక్కడ సినిమా చేసిన హంగామా అంతా అక్కడి ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. సో.. బాహుబలి-2 టైపులోనే ఆర్ఆర్ఆర్ కూడా జపాన్ లో హిట్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  20 Oct 2022 1:47 PM GMT
Next Story