Telugu Global
Cinema & Entertainment

RRR Movie: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు రామ్ చరణ్

RRR Movie: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫంక్షన్ కు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి హాజరుకాబోతున్నారు. ఈ మేరకు రామ్ చరణ్ ఓ స్టిల్ రిలీజ్ చేశాడు

RRR Movie: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు రామ్ చరణ్
X

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ విజువ‌ల్ వండ‌ర్ RRR. అంతర్జాతీయ ప్రేక్షకుల, విమర్శలకుల ప్రశంసలు సైతం అందుకుంది ఈ సినిమా. ఈ క్రమంలో కొన్ని అవార్డుల‌ను సైతం సొంతం చేసుకుంది. అదే క్ర‌మంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరి కింద నాటు నాటు సాంగ్‌.. అలాగే బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేట‌గిరీలో ఈ సినిమా నామినేట్ అయింది.

ఇప్పడీ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు చరణ్-తారక్-జక్కన్న వెళ్తున్నారు. లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి వీళ్లు ముగ్గురు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. RRR లోగో ఉన్న బ్లాక్ క‌ల‌ర్ రాయ‌ల్ సూట్ వేసుకున్న స్టైలిష్ లుక్ ఉన్న ఫొటోను ఈ సందర్భంగా రామ్ చ‌ర‌ణ్ షేర్ చేశాడు.

ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మానికి కొన్ని రోజులే ఉండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కుల్లో ఉత్కంఠ‌ నెల‌కొంది. ఈ కార్య‌క్ర‌మంలో RRR అవార్డుల‌ను ద‌క్కించుకుంటుందని ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.

ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా పరిగణిస్తారు. కాబ‌ట్టి RRRకు గోల్డెన్ గ్లోబ్ దక్కితే, మార్చిలో జ‌ర‌గ‌బోయే ఆస్కార్ అవార్డ్స్‌ రేసులోనూ ఇది ముందువరుసలో నిలుస్తుంది.

RRR సినిమాలో రామ్ చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించారు.




First Published:  3 Jan 2023 4:30 AM GMT
Next Story