Telugu Global
Cinema & Entertainment

Ram Charan daughter: పాప నా పోలికలోనే ఉందంటున్న చరణ్

Ram Charan daughter name: తన కూతురు అచ్చం తనలానే ఉందంటున్నాడు చరణ్. పాపకు పేరు కూడా ఫిక్స్ చేశాడంట.

Ram Charan daughter: పాప నా పోలికలోనే ఉందంటున్న చరణ్
X

రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తుల‌కు జూన్ 20న పాప పుట్టిన సంగ‌తి తెలిసిందే. అపోలో డాక్టర్ల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే త‌ల్లీ, బిడ్డ ఉన్నారు. పాప పుట్టిన తర్వాత 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది ఉపాసన. ఈరోజు హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయింది. మొయినాబాద్‌లోని త‌న త‌ల్లి ఇంటికి బ‌య‌లుదేరింది.

ఉపాసనను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్లేముందు.. చరణ్ మీడియాతో మాట్లాడాడు. ఉపాసన, పాప క్షేమంగానే ఉన్నారని, మరోసారి స్పష్టం చేసిన చరణ్, డాక్టర్స్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పాడు.

"మా అభిమానుల ప్రార్థ‌న‌లు, వాళ్లు చేసిన పూజలు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. వాళ్ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ఇంత‌క‌న్నా వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నేనేం అడుగుతాను. అలాగే అన్నీ దేశాల నుంచి మా శ్రేయోభిలాషులు, ఇత‌రులు ఆశీస్సులు అందించారు. అందరి ఆశీర్వాదాలు మా పాపకు ఉండాలి. ఈ మ‌ధుర క్ష‌ణాల‌ను నేను మ‌ర‌చిపోలేను. మీ అభిమానం చూస్తుంటే మాట‌లు రావ‌టం లేదు. ఈ అభిమానం మా పాప‌కు కూడా ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను."

21వ రోజు పాప‌కు పేరు పెడ‌తామని స్పష్టం చేశాడు చరణ్. ఆల్రెడీ పాపకు ఓ పేరు నిర్ణయించారట. త్వరలోనే ఆ పేరును బయటపెడతామంటన్నాడు. చాలా సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న మంచి స‌మ‌యం వచ్చినందుకు, ఆనందంగా ఉందన్న చరణ్.. ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం, మరింత సంతోషంగా ఉందన్నాడు.

First Published:  23 Jun 2023 1:29 PM GMT
Next Story