Telugu Global
Cinema & Entertainment

Ram Charan: హాలీవుడ్ పార్టీలో మెరిసిన చరణ్

Ram Charan: హాలీవుడ్ లో జరిగిన పెద్ద సెలబ్రిటీ పార్టీకి హాజరయ్యాడు రామ్ చరణ్. ఇండియా నుంచి చరణ్ కు మాత్రమే ఈ గౌరవం దక్కింది.

Ram Charan: హాలీవుడ్ పార్టీలో మెరిసిన చరణ్
X

ఇప్పుడు విశ్వ‌వేదిక మీద మెరుస్తున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఆయ‌న ప్ర‌స్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉన్నాడు. 2023 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కోసం ఆయ‌న లాస్ ఏంజెల్స్‌కి వెళ్లాడు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రెండు కేట‌గిరీల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ విభాగంలోనూ, నాటు నాటు పాట బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ విభాగంలోనూ నామినేట్ అయిందీ చిత్రం.

జ‌న‌వ‌రి 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. అయితే ఆ వేడుక క‌న్నా ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ చ‌ర‌ణ్ మ‌రో వేడుక‌లో మెరిశాడు. కాలిఫోర్నియాలోని బేవెర్లీ హిల్స్ లో జ‌రిగిన ఓ అంద‌మైన వేడుక‌లో రామ్‌చ‌ర‌ణ్ త‌ళుక్కుమ‌న్నాడు. లూయిస్ విట్ట‌న్ ఎక్స్ డ‌బ్ల్యూ మ్యాగ‌జైన్ సీజ‌న్‌ కిక్ ఆఫ్ పార్టీల్లో హాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో వేదిక పంచుకున్నాడు చ‌ర‌ణ్‌.

మిరిండా కెర్‌, మిశ్చ‌ల్ యోతో పాటు ప‌లువురు హాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మ‌న దేశం నుంచి ఈ పార్టీకి హాజ‌రైన ఏకైక న‌టుడు రామ్‌చ‌ర‌ణ్ కావ‌డం తెలుగు వారికి గ‌ర్వ‌కార‌ణం. తెలుగు సినిమాకు అంత‌ర్జాతీయ వేదిక‌ మీద ప్రాతినిధ్యం వ‌హించాడు రామ్‌చ‌ర‌ణ్‌.

లూయిస్ విట్ట‌న్ పార్టీలో రామ్‌చ‌ర‌ణ్ ఫ్యాష‌న్ స్టేట్‌మెంట్ ఆక‌ట్టుకుంది. బ్లేజ‌ర్‌, ప్రింట‌డ్ ష‌ర్ట్ తో హ్యాండ్‌స‌మ్‌గా క‌నిపించాడు.








First Published:  9 Jan 2023 6:30 AM GMT
Next Story