Telugu Global
Cinema & Entertainment

The India House - చరణ్ నిర్మాతగా, నిఖిల్ హీరోగా సినిమా

The India House - నిర్మాతగా కొత్త సినిమా ప్రకటించాడు చరణ్. నిఖిల్ హీరోగా నటించబోతున్నాడు.

The India House - చరణ్ నిర్మాతగా, నిఖిల్ హీరోగా సినిమా
X

రామ్ చరణ్, యూవీ విక్కీ కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే బ్యానర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ బ్యానర్ పై తొలి సినిమా ప్రకటించారు. నిఖిల్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు 'ది ఇండియా హౌస్' అని పేరు పెట్టారు.

ఈ చిత్రానికి నూతన దర్శకుడు రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరోగా నిఖిల్ కనిపించనున్నాడు. అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఈ సినిమాను ఎనౌన్స్ చేశారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ బ్యానర్ తో నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా కలిశాడు.

ప్రేక్షకులను గత కాలంలోకి తీసుకెళ్లి, వారి హృదయాలను హత్తుకుని కథతో ఇండియా హౌస్ రెడీ అవుతోందంటున్నారు మేకర్స్. లండన్‌లో స్వతంత్రానికి పూర్వం జరిగిన కథతో ఈ సినిమా వస్తోంది. ది ఇండియా హౌస్ చుట్టూ జరిగిన రాజకీయ అలజడి నేపథ్యంలో, ఓ సరికొత్త ప్రేమకథను చూపించబోతున్నారు. ఇండియా హౌస్ కాలిపోతున్న దృశ్యంతో ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ వివరాల్ని ఇంకా వెల్లడించలేదు. సినిమా లాంఛింగ్ రోజున ఆ వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

First Published:  28 May 2023 12:06 PM GMT
Next Story