Telugu Global
Cinema & Entertainment

Ramcharan Upasana - మెగా కపుల్ వీడియోకు భారీ వ్యూస్

Ramcharan and Upasana - ఆస్కార్ వేడుక సందర్భంగా చరణ్-ఉపాసనపై తీసిన ఓ వీడియోకు రికార్డ్ వ్యూస్ వచ్చాయి. హాలీవుడ్ యూట్యూబ్ ఛానెల్ లో ఇదే రికార్డ్.

Ramcharan Upasana - మెగా కపుల్ వీడియోకు భారీ వ్యూస్
X

రీసెంట్‌గా రామ్ చ‌ర‌ణ్‌.. త‌న భార్య ఉపాస‌న‌తో క‌లిసి ఆస్కార్ అవార్డ్స్ సంద‌ర్భంగా వానిటీ ఫెయిర్ సంస్థకు ఓ వీడియో చేశాడు. సదరు సంస్థ యూట్యూబ్ చానెల్లో సరికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది ఈ వీడియో. ఆస్కార్‌కి రెడీ అవుతోన్న ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పేరుతో వీడియోను యూట్యూబ్ చానెల్‌లో పోస్ట్ చేయ‌గా దానికి 6.5 మిలియ‌న్స్ కంటే ఎక్కువ వ్యూస్ వ‌చ్చాయి.

గమ్మత్తైన మేటర్ ఏంటంటే.. ఆ చానెల్‌లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన వీడియో అదే కావ‌టం విశేషం. హాలీవుడ్ కు చెందిన ఈ యూట్యూబ్ ఛానెల్ లో ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు ఎక్కువ వ్యూస్ వచ్చాయన్నమాట. ఆస్కార్ లాంటి గొప్ప అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లే సంద‌ర్భంలో రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌నల‌పై ఈ వీడియోను చిత్రీక‌రించారు.

ఉపాస‌న‌కు ఆమె గ‌దిలో హెయిర్ స్ప్రేను స్ప్రే చేసే క్యూట్ మూమెంట్‌తో స్టార్ట్ అయ్యే ఈ వీడియో వారి వ్య‌క్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేసింది. రామ్ చరణ్ లోని భ‌క్తి కోణాన్ని బయటపెట్టిన వీడియో కూడా ఇదే.

చ‌రిత్ర‌ను సృష్టించే వేడుక‌కి బ‌య‌లుదేరేట‌ప్పుడు వారి గ‌దిలో ఏర్పాటు చేసుకున్న సీతారాముల ప్ర‌తిమ‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవ‌డం అప్పట్లో అందర్నీ ఆకర్షించింది. ఈ వీడియోకు ఇంకా వ్యూస్ వస్తుండడం విశేషం.

First Published:  22 April 2023 2:37 AM GMT
Next Story