Telugu Global
Cinema & Entertainment

Ram Charan: అసలు విషయాన్ని అంగీకరించిన చరణ్

ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చిన విషయాన్ని అంగీకరించాడు హీరో రామ్ చరణ్. ఆ టైమ్ లో చాలా టెన్షన్ పడ్డానంటూ, ఆర్ఆర్ఆర్ రిలీజైన మొదటి రోజు అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు.

Ram Charan: అసలు విషయాన్ని అంగీకరించిన చరణ్
X

ఆర్ఆర్ఆర్ సినిమా నిజంగానే పెద్ద హిట్టయిందా? ఆ సినిమాకు అసలు నెగెటివ్ టాక్ రాలేదా? ఎట్టకేలకు ఈ అంశంపై స్పందించాడు హీరో రామ్ చరణ్. తమ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిందన్నాడు.

450 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, నాలుగేళ్లు కష్టపడి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి రోజు 20శాతం నెగెటివ్ టాక్ వచ్చిందని వెల్లడించాడు రామ్ చరణ్. ఇంత కష్టపడి చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో తట్టుకోలేకపోయానని, ఆ విషయాన్ని నాన్న చిరంజీవికి ఎలా చెప్పాలో అర్థంకాలేదని, ఓ దశలో భయపడ్డానని అన్నాడు.

అయితే మొదటి రోజు వచ్చిన డివైడ్ టాక్, ఆ తర్వాత పోయిందంటున్నాడు చరణ్. పరిస్థితి నెమ్మదిగా మారిందని, పాన్ ఇండియా లెవెల్లో సినిమా సక్సెస్ అయిందని తెలిపాడు. ఈ సందర్భంగా పాన్ ఇండియా ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. మరీ ముఖ్యంగా సంప్రదాయ మార్కెట్ కలిగిన జపాన్ లో కూడా తమ సినిమా సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉందన్నాడు చరణ్.

ప్రస్తుతం ఈ హీరో, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. శంకర్ తో సినిమా చేయడం తన అదృష్టం అన్న చరణ్, ఆ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపాడు.

First Published:  13 Nov 2022 5:41 AM GMT
Next Story