Telugu Global
Cinema & Entertainment

Ramcharan - హాలీవుడ్ జర్నీకి చరణ్ రెడీ

Ramcharan - హాలీవుడ్ డెబ్యూపై ఈసారి మరింత విపులంగా స్పందించాడు రామ్ చరణ్.

Ramcharan - హాలీవుడ్ జర్నీకి చరణ్ రెడీ
X

ఇప్పటికే హాలీవుడ్ డెబ్యూపై తన అభిప్రాయాల్ని వెల్లడించిన రామ్ చరణ్, ఇప్పుడీ అంశంపై మరింత లోతుగా, స్పష్టంగా స్పందించాడు. హాలీవుడ్ లో సినిమాలు చేసే అంశంపై చరణ్ ఏమంటున్నాడో చూద్దాం..

- సినిమాను ఆరాధించే ఏ దేశానికి సంబంధించిన చిత్రంలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రణాళిక చేయాలి. దాన్ని సాకారం చేసుకోవాలి. నేను ఆ దిశగానే చర్చలు జరుపుతున్నాను. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. అయితే అవి సినిమాలుగా ఎలా షేప్‌ తీసుకుంటాయన్నది చూడాలి. కొన్ని నెలల్లో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.

- నాకు జూలియా రాబర్ట్స్‌తో పనిచేయాలని ఉంది. ఇండియాలో ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టామ్‌ క్రూయిజ్‌నీ, బ్రాడ్‌పిట్‌నీ, జూలియా రాబర్ట్స్ నీ ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నన్ను ఇండియన్‌ బ్రాడ్‌పిట్‌ అంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

- నేను హాలీవుడ్‌లో చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయాల‌నుకుంటున్నాను. వారిలో జె.జె.అబ్ర‌మ్స్ ఒక‌రు. క్వెన్టిన్ ట‌రాన్టినో నాకు ఎంతో ఇష్ట‌మైన‌ దర్శకుడు. ఆయ‌న డైరెక్ట్ చేసిన వార్ మూవీ ఇన్‌గ్లోరియ‌స్ బాస్టర్ట్స్ నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్ మూవీ. ఆయ‌న నాపై ఎంతో ప్ర‌భావాన్ని చూపారు. ఈ ద‌ర్శ‌కులు వారితో ప‌ని చేసే న‌టుల‌కు స‌వాలు విసురుతుంటారు.

First Published:  10 March 2023 3:52 PM GMT
Next Story