Telugu Global
Cinema & Entertainment

రామారావు ఆన్ డ్యూటీ ట్రయిలర్ రివ్యూ

రామారావు ఆన్ డ్యూటీ ట్రయిలర్ రిలీజైంది. రవితేజ హీరోగా నటించిన ఈ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

రామారావు ఆన్ డ్యూటీ ట్రయిలర్ రివ్యూ
X

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకుడిగా పరిచయమౌతున్న సినిమా ఇది. యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాని యూనిట్ ఇదివరకే ప్రకటించింది. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ సినిమా ట్రయిలర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది.

కూలీలు మిస్ అవుతారు, వాళ్లను కనిబెట్టే బాధ్యతను రామారావు తీసుకుంటాడు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న రామారావు, ఈ కేసును చేధించడం కోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెడతాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. ఇన్నాళ్లూ చట్టం కోసం పనిచేశాను, ఇప్పుడు ధర్మం కోసం పనిచేస్తానంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కు అర్థం అదే.

ఎప్పట్లానే రవితేజ, ట్రయిలర్ లో ఎనర్జిటిక్ గా కనిపించాడు. సినిమాలో పుష్కలంగా యాక్షన్ ఉందనే విషయాన్ని ట్రయిలర్ లో చెప్పేశారు. కాకపోతే రవితేజ నుంచి ఆడియన్స్ కోరుకునే మాస్ లుక్ మాత్రం మిస్ అయినట్టు కనిపిస్తోంది. ఇక ఇద్దరు ముద్దుగుమ్మలతో రవితేజ రొమాన్స్ చేసినట్టు ట్రయిలర్ లో చూపించారు.

ఖలేజాతో స్టార్ట్ చేసిన లిప్ కిస్ ట్రెండ్ ను ఈ సినిమాతో కూడా కొనసాగించాడు రవితేజ. ఏకంగా ట్రయిలర్ లోనే ఆ సీన్ పెట్టేశారు. ఇక వేణు తొట్టెంపూడి పాత్రను ట్రయిలర్ లో పరిచయం చేసిన మేకర్స్, ఆ పాత్రకు సంబంధించిన వివరాల్ని పెద్దగా వెల్లడించలేదు. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం ఓ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని ట్రయిలర్ లో వెల్లడించారు.

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈనెల 29న థియేటర్లలోకి వస్తున్నాడు రామారావు.



First Published:  16 July 2022 3:32 PM GMT
Next Story