Telugu Global
Cinema & Entertainment

రామారావు ఆన్ డ్యూటీ మొదటి వారాంతం వసూళ్లు

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా పూర్తిగా పడిపోయింది. నిన్న ఆదివారం మూవీకి కేవలం 37 లక్షల రూపాయలొచ్చాయి

Ramarao on Duty Movie 3 days box office collection
X

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా దారుణంగా పడిపోయింది. వీకెండ్ అయిన ఆదివారం కూడా ఈ సినిమాకు ఏమాత్రం వసూళ్లు రాలేదు. ఇంకా చెప్పాలంటే, నిన్న ఆదివారం ఈ సినిమాకు ఏపీ-నైజాం కలిపి 37 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తాజా వసూళ్లతో ఈ సినిమా పరాజయం పరిపూర్ణమైంది.

విడుదలైన ఈ 3 రోజుల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు కేవలం 3 కోట్ల 65 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ సినిమా రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ వారాంతానికి ఈ సినిమా రన్ పూర్తయ్యే అవకాశం ఉంది. టోటల్ గా బయ్యర్లకు అటుఇటుగా 10 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు ఏపీ,నైజాంలో మొదటి వారాంతం (3 రోజుల్లో) వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 1.21 కోట్లు

సీడెడ్ - 64 లక్షలు

ఉత్తరాంధ్ర - 54 లక్షలు

ఈస్ట్ - 37 లక్షలు

వెస్ట్ - 20 లక్షలు

గుంటూరు - 31 లక్షలు

నెల్లూరు - 15 లక్షలు

కృష్ణా - 23 లక్షలు

First Published:  1 Aug 2022 7:53 AM GMT
Next Story