Telugu Global
Cinema & Entertainment

'రామారావు' మొదటి రోజు వసూళ్లు

రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు మొదటి రోజు చాలా తక్కువగా వసూళ్లు వచ్చాయి

రామారావు మొదటి రోజు వసూళ్లు
X

రిలీజ్ కు ముందు బజ్ లేదు. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ లేవు. దీనికితోడు రిలీజైన మొదటి రోజే ఫ్లాప్ టాక్. అలా నీరసంగా మొదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు, మొదటి రోజు వసూళ్లు కూడా అంతే నీరసంగా వచ్చాయి. రవితేజ రీసెంట్ మూవీస్ లో అతి తక్కువ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా అవతరించింది రామారావు ఆన్ డ్యూటీ.

ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 82 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ,నైజాంలో ఈ సినిమాను 15 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 16 కోట్లు రావాలి. మొదటి రోజు వచ్చిన వసూళ్లు, సినిమాకు వచ్చిన టాక్ ను దృష్టిలో పెట్టుకొని చూస్తే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం దాదాపు అసాధ్యం.

తెలుగు రాష్ట్రాల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 85 లక్షలు

సీడెడ్ - 52 లక్షలు

ఉత్తరాంధ్ర - 45 లక్షలు

ఈస్ట్ - 31 లక్షలు

వెస్ట్ - 16 లక్షలు

గుంటూరు - 24 లక్షలు

నెల్లూరు - 12 లక్షలు

కృష్ణా - 17 లక్షలు

First Published:  30 July 2022 11:37 AM GMT
Next Story