Telugu Global
Cinema & Entertainment

వారియర్ నేను కాదు.. వాళ్లే సిసలైన వారియర్స్

రామ్ హీరోగా నటించిన సినిమా వారియర్. తాజాగా ఈ సినిమా రిలీజైంది. సక్సెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది.

వారియర్ నేను కాదు.. వాళ్లే సిసలైన వారియర్స్
X

వారియర్ సినిమాలో హీరోగా నటించాడు రామ్. మొన్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అయితే అసలైన వారియర్ తను కాదంటున్నాడు రామ్. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమించి, సాఫీగా విడుదలయ్యేలా చేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా వారియర్స్ అన్నాడు.

"సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి. అడ్డంకులు చాలా వచ్చాయి. లాస్ట్ మినిట్ డిజిటల్ ప్రింట్స్ వెళ్ళే వరకూ ఏదో ఒకటి వస్తూ ఉంది. మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడ్డారు. ఫైనల్లీ రిలీజ్ చేశారు. అదే పెద్ద సక్సెస్ అనుకున్నా. అటువంటి సమయంలో ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా విడుదల చేయాలా? వద్దా? అనే సందేహం వస్తుంది. కొవిడ్ వచ్చినా... వర్షాలు వచ్చినా... ఏం వచ్చినా... థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' మరోసారి ప్రూవ్ చేసింది."

వర్షాలు చూసి సినిమా వాయిదా వేయాలని అనుకున్న మాట నిజమేనని అన్నాడు రామ్. కానీ, తామంతా గట్టిగా నమ్మామని, ప్రేక్షకులు వస్తారని అనుకున్నామని, ఫస్ట్ డే అదే ప్రూవ్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొంత మంది ప్రేక్షకులు సినిమా చూడలేకపోయారని, అలాంటి వాళ్లంతా సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరాడు రామ్.

ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటూ యూనిట్ లో కీలక సభ్యులంతా సక్సెస్ మీట్ పెట్టుకున్నారు. ఈ సక్సెస్ మీట్ కు నిర్మాతతో పాటు.. రామ్, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, దర్శకుడు లింగుసామి హాజరయ్యారు.

First Published:  16 July 2022 10:50 AM GMT
Next Story