Telugu Global
Cinema & Entertainment

Skanda Movie | మరో 2 రోజుల్లో ఫస్ట్ సింగిల్

Skanda Movie - స్కంద మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కు డేట్ లాక్ చేశారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రోమో రిలీజ్ చేశారు.

Skanda Movie | మరో 2 రోజుల్లో ఫస్ట్ సింగిల్
X

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకంటే ముందు విడుదల చేసిన గ్లింప్స్ కూడా బాగుంది. ది ఎటాకర్ అనే ట్యాగ్‌లైన్ తో వస్తున్న ఈ సినిమాలో, మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌ లో రామ్ ను చూడబోతున్నారు ప్రేక్షకులు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ్టి నుంచి ఈ సినిమా లిరికల్ వీడియోస్ ప్రచారం మొదలుపెట్టారు. ముందుగా “నీ చుట్టు చుట్టు” సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. మరో 2 రోజుల్లో, అంటే 3వ తేదీన ఈ లిరికల్ వీడియోను రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించిన ప్రోమోను కొద్దిసేపటి కిందట విడుదల చేశారు.

ఈ సినిమా కోసం రామ్, పూర్తిగా మేకోవర్ అయ్యాడు. కేవలం సినిమా కోసం కాకుండా, పాటల కోసం కూడా కొత్తగా ముస్తాబయ్యాడనే విషయం తాజాగా రిలీజైన పోస్టర్ చూస్తే అర్థమౌతుంది. అంతేకాదు, రాబోయే సాంగ్, ఓ డాన్స్ నంబర్ అనే విషయం కూడా ప్రోమో చూస్తే తెలుస్తోంది.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇంతకుముందు బోయపాటి-తమన్ కాంబోలో వచ్చిన అఖండ సినిమా, మ్యూజికల్ గా పెద్ద హిట్టయింది. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. స్కంద సినిమా ఆ మేజిక్ ను రిపీట్ చేస్తుందని భావిస్తున్నారు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నారు. రామ్ కెరీర్ లో ప్రాపర్ పాన్ ఇండియా రిలీజ్ ఇది. ఒకేసారి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్కంద సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ ఎలా చేస్తారో చూడాలి.

First Published:  1 Aug 2023 6:19 AM GMT
Next Story