Telugu Global
Cinema & Entertainment

Ram Pothineni - రామ్ సినిమాకు భారీ క్లయిమాక్స్

Ram Pothineni - బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని, ఈ మూవీ క్లయిమాక్స్ పార్ట్ కోసం ఏకంగా 24 రోజులు కష్టపడ్డాడు ఈ హీరో.

Ram Pothineni - రామ్ సినిమాకు భారీ క్లయిమాక్స్
X

బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ మేకర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. హీరో పుట్టినరోజు సందర్భంగా ఇటీవల వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేశారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేశారు.

రామ్ హుషారుకు, ఎనర్జీకి లిమిట్స్ ఉండవు. బోయపాటి శ్రీను సినిమాల్లో భారీతనానికి కూడా లిమిట్స్ ఉండవు. వీళ్ళిద్దరూ కలిస్తే... సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ తాజాగా రిలీజైన గ్లింప్స్. ఇక సినిమా క్లయిమాక్స్ విషయానికొస్తే, ఏకంగా 24 రోజుల పాటు ఈ క్లయిమాక్స్ షూట్ ను నిర్వహించారు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ బయటపెట్టాడు.

''ఫైనల్లీ... క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. యాక్షన్ సీక్వెన్స్ కోసం 24 రోజులు చిత్రీకరణ చేశాం. ఇది క్లైమాక్స్ కాదు... క్లయిమామా...క్స్'' అంటూ రామ్ ట్వీట్ చేశాడు. క్లైమాక్స్ అయితే 'మ్యాక్స్' అంటూ రామ్ పోతినేని మరిన్ని అంచనాలు పెంచాడు.

త్వరలో సినిమా టైటిల్ తో పాటు, ఇతర వివరాల్ని వెల్లడిస్తారు. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది ఈ సినిమా. ఇందులో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  3 Jun 2023 2:08 PM GMT
Next Story