Telugu Global
Cinema & Entertainment

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని?

హీరో రామ్ మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు. మొన్ననే లింగుసామి దర్శకత్వంలో సినిమా చేసిన ఈ హీరో, త్వరలోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రామ్ పోతినేని?
X

నటుడు రామ్ పోతినేని పూర్తిగా తన ట్రాక్ మార్చిన సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మాస్-యాక్షన్ కథలు మాత్రమే చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడీ నటుడు రూటు మార్చినట్టు కనిపిస్తోంది. త్వరలోనే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు రామ్. గౌతమ్ మీనన్ సినిమాలు మాస్ అంశాలకు దూరంగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు హీరో రామ్. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబోకి సంబంధించి ప్రాజెక్ట్ లాక్ అయింది. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.

గౌతం మీనన్ ప్రస్తుతం రామ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇటీవల కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో రామ్ 'ది వారియర్' చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో కోలీవుడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. ఇది కూడా వారియర్ టైపులో బై-లింగ్వల్ సినిమానే.

బోయపాటి-రామ్ సినిమా రిలీజ్ అయిన వెంటనే గౌతమ్ మీనన్ సినిమా షూటింగ్ మొదలవుతుంది. తాజాగా శింబు హీరోగా గౌతమ్ మీనన్ తీసిన ఓ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో రామ్-గౌతమ్ మీనన్ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి.

First Published:  17 Sep 2022 6:53 AM GMT
Next Story