Telugu Global
Cinema & Entertainment

Ram Pothineni: బోయపాటితో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన రామ్

Ram Pothineni, Boyapati Srinu: బోయపాటి దర్శకత్వంలో రామ్ చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించి, కొత్త షెడ్యూల్ నిన్నట్నుంచి మొదలైంది.

Ram Pothineni: బోయపాటితో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన రామ్
X

బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి భారీ విజయం తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో, ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది.

ఈ షెడ్యూల్ లో రామ్ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఫైట్ ఇది. స్టంట్ శివ నేతృత్వంలో ఈ ఫైట్ తీస్తున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఏకథాటిగా జరుగుతుంది ఈ షెడ్యూల్. ఇందులోనే కీలకమైన సన్నివేశాలతో పాటు, హీరోహీరోయిన్ల మధ్య ఓ డ్యూట్ కూడా పిక్చరైజ్ చేస్తారు.

ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలల హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఆంధ్రా-తెలంగాణల నేపథ్యంలో సాగే సినిమా ఇది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

వారియర్ తో ఫ్లాప్ అందుకున్నాడు రామ్. దీంతో బోయపాటి సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వారియర్ తో తమిళ్ లో అడుగుపెట్టిన రామ్, బోయపాటి మూవీతో హిందీ మార్కెట్ లో అడుగుపెట్టబోతున్నాడు.

First Published:  2 Dec 2022 4:43 AM GMT
Next Story