Telugu Global
Cinema & Entertainment

#BoyapatiRAPO - రామ్ ఫస్ట్ థండర్ అదిరింది

Ram Pothineni, Boyapati - రామ్ పోతినేని, బోయపాటి కలిసి చేస్తున్న సినిమాకు సంబంధించి గ్లింప్స్ రిలీజ్ చేశారు. బోయపాటి మార్కు స్పష్టంగా కనిపించింది.

#BoyapatiRAPO - రామ్ ఫస్ట్ థండర్ అదిరింది
X

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ థండర్ పేరిట వీడియో రిలీజ్ చేశారు.

థండర్ ఒక బ్లాస్టింగ్ ఎపిసోడ్‌ తో ప్రారంభమవుతుంది. రామ్ తనదైన శైలిలో మాస్ ఎంట్రీ ఇస్తూ సదర్ పండగ కు ఒక పెద్ద ఎద్దుని తీసుకొస్తాడు. అక్కడ గూండాల గ్యాంగ్ తో మాసివ్ ఫైట్ చేస్తాడు. ప్రతి ఫ్రేమ్‌ లో బోయపాటి స్టాంప్ ఉంది. రామ్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో అదనపు బలాన్ని తీసుకొచ్చాడు.

రామ్ మునుపెన్నడూ చూడని మాస్ లుక్‌ లో కనిపించాడు. పాత్ర కోసం తన శరీరాన్ని బిల్డ్ చేశారు. “నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా... నీ గేటు దాటలేనన్నావ్ దాటా... నీ పవర్ దాటలేనన్నావ్ దాటా... ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్...” అనే డైలాగ్ అభిమానులను, మాస్ ని మెప్పిస్తుంది. శ్రీలీల ని కూడా వీడియోలో చూడవచ్చు.

సంతోష్ డిటాకే తన కెమెరా పనితనం తో ఆకట్టుకున్నాడు. తమన్ బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.



First Published:  15 May 2023 1:51 PM GMT
Next Story