Telugu Global
Cinema & Entertainment

Ram Pothineni - కాస్త ముందుగానే రామ్-బోయపాటి సినిమా

Ram Pothineni - బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తన్నాడు రామ్. ఈ మూవీని అనుకున్న టైమ్ కంటే ముందే విడుదల చేయబోతున్నారట.

Ram Pothineni - కాస్త ముందుగానే రామ్-బోయపాటి సినిమా
X

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కలిసి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కాకపోతే రామ్ పుట్టిన రోజు సందర్భంగా పవర్ ఫుల్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అదే టైమ్ లో ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ లో కాకుండా.. ఆగస్ట్ లేదా సెప్టెంబరులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇలా ప్రీ పోన్ చేయడానికి ఓ కారణం ఉంది.

దసరాకు బాలకృష్ణ, బోయపాటి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమాతో పోటీ పడేంత సాహసం చేయడు బోయపాటి. ఎందుకంటే, బాలయ్యపై బోయపాటికి ఉన్న అభిమానం, గౌరవం అలాంటివి. అటు రామ్ కు కూడా బాలయ్య సినిమాతో పోటీపడడం ఇష్టం లేదు. అందుకే ఇలా సినిమాను ముందుగానే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆల్రెడీ మొదలుపెట్టారు. జూన్ లో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారు. ఆ టైమ్ లో రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Next Story