Telugu Global
Cinema & Entertainment

Ram Pothineni | మరోసారి సిక్స్ ప్యాక్ లోకి మారిన హీరో

Ram Pothineni 6 pack abs | స్కంద సినిమా కోసం బరువు పెరిగాడు రామ్. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం మరోసారి సిక్స్ ప్యాక్ బాడీ సాధించాడు.

Ram Pothineni | మరోసారి సిక్స్ ప్యాక్ లోకి మారిన హీరో
X

Ram Pothineni | మరోసారి సిక్స్ ప్యాక్ లోకి మారిన హీరో

హీరో రామ్ పోతినేని మళ్లీ ఉస్తాద్ మోడ్‌లోకి వచ్చాడు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్‌ తో చేస్తున్న తన పాన్ ఇండియా చిత్రం 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. తన మునుపటి చిత్రం 'స్కంద' కోసం బరువు పెరిగిన రామ్, డబుల్ ఇస్మార్ట్ కోసం కొన్ని కిలోల బరువు తగ్గారు. అంతేకాదు, చాలా తక్కువ టైమ్ లో సిక్స్ ప్యాక్ లోకి మారాడు.

ఈ సినిమా కోసం రామ్ సిక్స్-ప్యాక్ కండలు సాధించాడు. దీనికి సంబంధించి తాజాగా ఓ ఫొటో కూడా షేర్ చేశాడు ఈ హీరో. ఇందులో కండలు తిరిగిన ఫిజిక్ ని చూపించాడు. రామ్ తన ముఖాన్ని చూపించనప్పటికీ, బాడీ మాత్రం ఫిట్ గా ఉందని తన ఫొటోతో తెలియజేశాడు. రామ్‌ని ఇలా మేకోవర్ చేసిన క్రెడిట్ పూరి జగన్నాధ్‌కి కూడా దక్కుతుంది.

రామ్, పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో బ్లాక్‌బస్టర్ అయిన 'ఇస్మార్ట్ శంకర్‌'కి సీక్వెల్ గా వస్తోంది డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాస్, యాక్షన్ సినిమాలని ఇష్టపడేవారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుందని చెబుతున్నాడు పూరి.

సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ హై-బడ్జెట్‌ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'డబుల్ ఇస్మార్ట్' మూవీని వచ్చే ఏడాది మార్చి 8న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు.

First Published:  3 Nov 2023 12:50 AM GMT
Next Story