Telugu Global
Cinema & Entertainment

Ram Pothineni | ప్రతి ఫ్యామిలీ స్కందకు కనెక్ట్ అవుతుంది

Ram Pothineni - స్కంద సినిమా కేవలం యాక్షన్ మూవీ కాదంటున్నాడు హీరో రామ్ పోతినేని. ఫ్యామిలీస్ కు కూడా నచ్చుతుందని చెబుతున్నాడు.

Ram Pothineni | ప్రతి ఫ్యామిలీ స్కందకు కనెక్ట్ అవుతుంది
X

"కనిపించని దేవుడ్ని కనిపించమని అడుగుతాం. కని-పెంచిన దేవుళ్లను పట్టించుకోకపోతే ఎలా" అనే డైలాగ్ స్కంద సినిమాలో ఉంది. స్కంద సినిమా కేవలం యాక్షన్ మూవీ కాదని, ఇందులో మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందని చెప్పడానికి ఈ డైలాగ్ ఒక ఎగ్జాంపుల్ అంటున్నాడు రామ్.

"ఆ ఎంటైర్ సీన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. మొన్ననే మళ్లీ చూశాను. ప్రతి ఫ్యామిలీ ఆ ఎపిసోడ్ కు కనెక్ట్ అవుతుంది. కొడుకు, తండ్రి, తల్లి, అక్క, చెల్లి, అన్న.. ఇలా ప్రతి ఒక్కరు దానికి కనెక్ట్ అవుతారు."

బోయపాటి దర్శకత్వంలో స్కంద సినిమా చేసిన రామ్, ఆ మూవీ ప్రమోషన్స్ ను అధికారికంగా ప్రారంభించాడు. సినిమాను ఆల్రెడీ తను ఓసారి చూశానని తెలిపిన ఈ హీరో, మూవీ బాగా వచ్చిందని, బోయపాటి మార్క్ తో పాటు తన స్టయిల్ కూడా ఉంటుందని అంటున్నాడు.

రామ్-బోయపాటి ఫ్రెష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో అతడి సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టు హీరో-దర్శకుడిది ఫ్రెష్ కాంబో కాగా.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా ఇది.

First Published:  23 Sep 2023 5:59 PM GMT
Next Story