Telugu Global
Cinema & Entertainment

Ram Gopal Varma | వ్యూహం సినిమాపై ఆర్జీవీ రియాక్షన్

Ram Gopal Varma Vyuham Movie - తను తీస్తున్న వ్యూహం సినిమా గురించి ఆసక్తికర వివరాలు బయటపెట్టాడు దర్శకుడు వర్మ.

Ram Gopal Varma | వ్యూహం సినిమాపై ఆర్జీవీ రియాక్షన్
X

జగన్ రాజకీయ జీవితంపై వ్యూహం అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరి ఈ సినిమాలో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఏఏ అంశాలు ఉండబోతున్నాయి. వివేక హత్య కేసు అంశం ఉందా? లోకేష్ యువగళంకు చోటిచ్చాడా? పవన్ పోర్షన్ ఎంత? ఈ ప్రశ్నలన్నింటికీ ఆర్జీవీ సమాధానం ఇచ్చాడు. అతడి మాటల్లోనే...

- ఎన్నికల టైమ్ లో వ్యూహం సినిమా ఎంత ప్రభావం చూపిస్తుందో నాకు తెలీదు. ప్రభావం చూపిస్తుందనే తీస్తున్నాం.

- ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలన్నీ ఉన్నాయి. లోకేష్ చేసిన యువగళం ఇంపార్టెంట్ విషయం అని నేను అనుకోవడం లేదు. పవన్ కల్యాణ్ పాదయాత్ర మాత్రం ఇందులో ఉంది.

- నేను ఈ సినిమాతో ఎవ్వర్నీ టార్గెట్ చేయడం లేదు. కేవలం నిజం చెబుతున్నాను. దాన్ని ఎంతమంది నమ్ముతారో చూడాలి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో నిలకడ కనిపించడం లేదు. అదే ఈ సినిమాలో చూపిస్తున్నాను.

- నా సినిమా జగన్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందంటే నేను నమ్మను. నాకు జగన్ పై ఉన్న ఒపీనియన్, జగన్ పై ఉన్న రియాలటీని చూపించడమే నా ఉద్దేశం. వ్యూహం ఒక సినిమానే అని అంతా అనుకుంటున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను తీస్తున్నాను.

- వివేక హత్య కేసుకు సంబంధించి ప్రస్తుత పరిస్థితేంటని 10 మందిని అడిగితే 10 వెర్షన్లు చెబుతారు. వ్యూహంలో ఏ వెర్షన్ పెట్టాలి? అందుకే వివేక హత్యకు సంబంధించి ఈ సినిమాలో నా వెర్షన్ మాత్రమే చెబుతున్నాను. నా వెర్షన్ ఏంటనేది సినిమాలో చూడాలి. నిందితుడు ఎవరనేది నేను చెప్పను.

- షూటింగ్ దాదాపు 70శాతం పూర్తయింది. పార్ట్-1 అక్టోబర్ రిలీజ్ అనుకుంటున్నాను. పార్ట్-2 ఎలక్షన్ ముందు రిలీజ్ అవుతుంది.

First Published:  13 Aug 2023 1:54 PM GMT
Next Story