Telugu Global
Cinema & Entertainment

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Ram Charan, Upasana: మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ పుట్టడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
X

మెగా ఫ్యామిలీలో పండుగ వాతావరణం నెలకొన్నది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మంగళవారం ఉదయం పండంటి ఆడబిడ్డ పుట్టింది. సోమవారమే ఉపాసన జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ పుట్టబోయే బిడ్డ కోసం ఫ్లెక్సీలు కట్టారు. తమ అభిమాన హీరో ఇంట ఎవరు పుడతారా అని ఆసక్తిగా ఎదురు చూశారు. మంగళవారం తెల్లవారుజామున ఆడపిల్ల పుట్టినట్లు అపోలో ఆసుపత్రి మెడికల్ బులిటెన్‌లో తెలియజేసింది. ఈ వార్తతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి.

మెగా ఫ్యామిలీలో ప్రిన్సెస్ పుట్టడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఆసుపత్రిలో రామ్ చరణ్, చిరంజీవి, సురేఖ దంపతులు ఉద్విగ్న క్షణాలను ఎంతో ఆనందంతో అనుభవించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు వారసురాలి పేరు మీద దేవాలయాల్లో పూజలు, అర్చనలు చేయిస్తున్నారు. రామ్ చరణ్ - ఉపాసన ఇటీవలే 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టడంతో దంపతులు ఇద్దరూ ఆనందంలో మునిగిపోయారు. కాగా. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.




First Published:  20 Jun 2023 3:07 AM GMT
Next Story