Telugu Global
Cinema & Entertainment

Narakasura | రక్షిత్ అట్లూరి సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Rakshit Atlutri Narakasura - నరకాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రక్షిత్ అట్లూరి. తాజాగా ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Narakasura | రక్షిత్ అట్లూరి సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా "నరకాసుర". అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న "నరకాసుర" సినిమా గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు.

గత నెలలోనే నరకాసుర ఫస్ట్ కాపీ రెడీ అయింది. 2 వేలకు పైగా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అందుకున్న ఉషా పిక్చర్స్ ద్వారా మా సినిమాను నవంబర్ 3న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం రక్షిత్ రెండేళ్లు ఒకే గెటప్ మెయింటేన్ చేశాడు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ అయ్యాయి. అందులో ఆశ్చర్యపరిచే అంశాలున్నాయి. అంతకుమించి సినిమా ఉంటుందంటున్నాడు రక్షిత్. నరకాసుర అంటే అందరికీ దీపావళి గుర్తుకొస్తుందని, అందుకే దీపావళి నెలలోనే సినిమాను విడుదల చేస్తున్నాని అన్నాడు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - "నాకు ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. మంచి సినిమాలు చేసి తెచ్చుకునే గుర్తింపే నా బ్యాక్ గ్రౌండ్ అనుకుంటున్నా. లండన్ బాబులు, పలాస, "నరకాసుర" , రాబోయే శశివదనే, ఆపరేషన్ రావణ్ .ఈ సినిమాలన్నీ కొత్త కథలతో, కాన్సెప్టులతో ఉంటూ నాకు మంచి పేరు తెస్తాయని ఆశిస్తున్నాను. నా సినిమా రిలీజ్ మధ్య గ్యాప్ వచ్చినా ప్రేక్షకులు ఇంకా పలాస ఫేమ్ గా గుర్తుపెట్టుకున్నారు. కాఫీ ఎస్టేట్ నేపథ్యంగా సాగే సినిమా ఇది. ఈ జానర్ సినిమాల్లో "నరకాసుర" బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అవుతుంది"

నరకాసురలో అన్నీ ఉన్నాయంటున్నాడు రక్షిత్. యాక్షన్, కామెడీ, లవ్, రొమాన్స్.. ఇలా అన్ని హంగులతో సినిమా అలరిస్తుందని చెబుతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటకలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

First Published:  11 Oct 2023 3:06 PM GMT
Next Story