Telugu Global
Cinema & Entertainment

Rajinikanth | అక్టోబర్ లో రజనీకాంత్ సినిమా

Rajinikanth - సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా రెడీ అయింది. దసరా కానుకగా రాబోతోంది.

Rajinikanth | అక్టోబర్ లో రజనీకాంత్ సినిమా
X

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్‌లో రజినీ స్టైల్, ఆ నవ్వు, గన్ను పట్టిన విధానం, హెయిర్ స్టైల్ అన్నీ అభిమానులను మెప్పించేలా ఉన్నాయి. ఇక ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుందని ప్రకటించడంతో దసరా పోటీ రసవత్తరంగా మారేలా కనిపిస్తోంది. దసరాకు తెలుగులో దేవర సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి పూర్తిస్థాయిలో హీరోగా వస్తున్న సినిమా ఇదే. మధ్యలో లాల్ సలామ్ అనే మూవీ చేసినప్పటికీ, అందులో ఆయనది కాస్త పెద్ద గెస్ట్ రోల్ మాత్రమే.

First Published:  7 April 2024 5:11 PM GMT
Next Story