Telugu Global
Cinema & Entertainment

Rajinikanth | సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ కూడా!

Rajinikanth's Lal Salaam - సంక్రాంతి పోటీ మరింత పుంజుకుంది. రజనీకాంత్ కూడా రేసులోకి ఎంటరయ్యారు.

Rajinikanth | సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ కూడా!
X

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ దూసుకుపోతోంది ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ వచ్చాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి ‘లాల్ సలాం’.

విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తున్నారు. ముంబయికి చెందిన మొయిద్దీన్ భాయ్ గా రజనీ కనిపించనున్నారు. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుగుతున్నాయి. తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేశారు. లాల్ సలామ్ సినిమాను 2024 సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్నట్లు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌క‌టించింది. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

తాజా ఎనౌన్స్ మెంట్ తో సంక్రాంతి పోటీ మరింత పెరిగింది. ఇప్పటికే లిస్ట్ లో గుంటూరుకారం, నా సామిరంగ, హను-మాన్ లాంటి సినిమాలున్నాయి. వీటితో పాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ మూవీ కూడా చేరింది. ఇక డబ్బింగ్ విషయానికొస్తే, శివకార్తికేయన్ నటిస్తున్న అయలాన్ సినిమా కూడా రేసులో నిలిచింది. ఇప్పుడీ సినిమాలన్నింటికీ కామన్ గా పోటీ ఇవ్వబోతోంది రజనీకాంత్ మూవీ.

First Published:  2 Oct 2023 8:25 AM GMT
Next Story