Telugu Global
Cinema & Entertainment

Jailer Sequel | జైలర్ సినిమాకు సీక్వెల్ వస్తోందా..?

Jailer Movie Sequel: రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

Jailer Sequel | జైలర్ సినిమాకు సీక్వెల్ వస్తోందా..?
X

Jailer Movie Review | జైలర్ మూవీ రివ్యూ {3/5}

Jailer Movie Sequel: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది జైలర్. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ 2023లో కోలీవుడ్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. చాలా ఏరియాల్లో ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తీయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు రజనీకాంత్. వరుసగా నిరాశపరుస్తున్న సూపర్ స్టార్, ఈ సినిమాతో తన స్టామినా చూపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్ థ్రిల్లర్, గత ఏడాది సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ కూడా నిలిచింది. ఈ ఏడాది లియో, సలార్ వంటి సినిమాలు వచ్చినప్పటికీ.. జైలర్ సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ను దాటలేకపోయాయి.

జైలర్ సీక్వెల్ పై నెల్సన్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాడు. సినిమా డ్రాఫ్ట్‌ కు రజనీకాంత్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. రజనీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా చిత్రంలో నటిస్తున్నారు.

దీని తరువాత, అతను వేసవిలో లోకేశ్ కనగరాజ్ చిత్రం స్టార్ట్ చేస్తారు. ఇవి కాకుండా సెల్వరాజ్‌తో ఒక చిత్రం కూడా లైన్లో ఉంది, అది కూడా ఈ ఏడాది చివరి నాటికి సెట్స్‌పైకి వెళ్లవచ్చు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత జైలర్-2 స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్‌లో నెల్సన్ కూడా మరో సినిమా చేసే అవకాశం ఉంది.

First Published:  8 Jan 2024 5:07 PM GMT
Next Story