Telugu Global
Cinema & Entertainment

Jailer | బ్లాక్ బస్టర్ దిశగా రజనీకాంత్ మూవీ

Rajinikanth's Jailer - సూపర్ స్టార్ రజనీకాంత్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. జైలర్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు. అభిమానుల దాహం తీర్చారు.

Jailer | బ్లాక్ బస్టర్ దిశగా రజనీకాంత్ మూవీ
X

సూపర్ స్టార్ రజనీకాంత్ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆయన నటించిన జైలర్ సినిమా భాషలతో సంబంధం లేకుండా సూపర్ హిట్టయింది. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో పాటు, లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఈ సినిమా మంచి వసూళ్లు చూస్తోంది. ఓవైపు చిరంజీవి లాంటి పెద్ద హీరో పోటీగా ఉన్నప్పటికీ, జైలర్ నెగ్గడం విశేషం.

ఒక రోజు తేడాతో రిలీజయ్యాయి భోళాశంకర్, జైలర్ సినిమాలు. వీటిలో ముందుగా జైలర్ రిలీజ్ కాగా, ఆ తర్వాత భోళాశంకర్ వచ్చింది. దీంతో జైలర్ రిలీజైన కొన్ని స్క్రీన్స్ ను చిరంజీవి సినిమాకు కేటాయించాల్సి వచ్చింది. అయితే భోళాశంకర్ సినిమాకు మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చింది.

దీంతో భోళాకు కేటాయించిన చాలా స్క్రీన్స్ ను 3వ రోజుకే తిరిగి జైలర్ కు కేటాయించడం విశేషం. అలా తెలుగులో ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

ఇక రెవెన్యూ పరంగా చూసుకుంటే, నిన్నటితో ఫస్ట్ వీకెండ్ (4రోజులు) పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 162 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. రిలీజైన మొదటి రోజుతో చూసుకుంటే, నాలుగో రోజుకు ఈ సినిమా వసూళ్లు ఇంకాస్త పెరగడం విశేషం.

First Published:  14 Aug 2023 2:56 AM GMT
Next Story