Telugu Global
Cinema & Entertainment

Rajinikanth - మొయిదీన్ భాయ్ గా మారిన సూపర్ స్టార్

Rajinikanth - జైలర్ సినిమాతో పాటు లాల్ సలామ్ అనే సినిమా చేస్తున్నారు రజనీకాంత్. లాల్ సలామ్ నుంచి సూపర్ స్టార్ ఫస్ట్ లుక్ మీకోసం..

Rajinikanth - మొయిదీన్ భాయ్ గా మారిన సూపర్ స్టార్
X

రజనీకాంత్ తో మరో సినిమా రెడీ చేస్తోంది లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2 తో సూపర్ సక్సెస్‌ను సాధించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్, తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘లాల్ సలాం’. ఐశ్వ‌ర్య రజినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే.

ఈరోజు ‘లాల్ సలాం’ చిత్రం నుంచి రజనీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘మొయిద్దీన్ భాయ్’ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ ఇది. లుక్‌ను గ‌మ‌నిస్తే ముస్లిం గెట‌ప్‌లో ర‌జినీకాంత్ రాయ‌ల్‌గా న‌డిచి వ‌స్తున్నారు. తలైవ‌ర్ మాస్ గెట‌ప్ ఓ రేంజ్‌లో ఉంది. బాషాలో మాణిక్ బాషాగా అల‌రించిన సూప‌ర్ స్టార్, ఇప్పుడు లాల్ స‌లాంలో మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించ‌బోతున్నారు.

రజనీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్‌ దర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు రామ‌స్వామి సినిమాటోగ్రాఫర్. జైలర్ సినిమా రిలీజైన తర్వాత, లాల్ సలాం సినిమా థియేటర్లలోకి వస్తుంది.




First Published:  8 May 2023 10:33 AM GMT
Next Story