Telugu Global
Cinema & Entertainment

Rajendra Prasad | 65 ఏళ్ల వయసులో ప్రేమ

Rajendra Prasad's New Movie Titles Love@65 - ఈ వయసులో మరోసారి హీరోగా నటించబోతున్నారు నటకిరిటీ రాజేంద్రప్రసాద్. అది కూడా లవ్ స్టోరీ కావడం విశేషం.

Rajendra Prasad | 65 ఏళ్ల వయసులో ప్రేమ
X

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒకే సమయంలో చాలా సినిమాలు నిర్మిస్తోంది, యూనిక్ కంటెంట్‌తో చిన్న సినిమాల నుంచి మీడియం-రేంజ్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ @ 65 అటువంటి సరికొత్త కంటెంట్ ఓరియెంటెడ్ మూవీనే.

గతంలో పలు బ్లాక్‌ బస్టర్లు అందించిన దర్శకుడు విఎన్ ఆదిత్య తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇదొక హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటున్నాడు దర్శకుడు. ఈరోజు, మేకర్స్ ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు.

ఆయనకి డెబ్బై నిండాయి. ఆవిడకి ఓ 65 ఉంటాయి. ఈ ఇద్దరూ కాలనీ నుండి పారిపోయిన ఆసక్తికరమైన సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. విచారణలో, వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, వారి జీవితాంతం ఒకరితో ఒకరు గడపాలని నిర్ణయించుకున్నారని తేలుతుంది. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, మనసును కదిలించే భావోద్వేగాలు కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది.

ఈ చిత్రంలో కార్తీక్ రాజు, స్పందన, క్రిష్, నిహంత్రీ రెడ్డి, నారాయణరావు, ప్రదీప్, సాయి శ్రీనివాస్, ప్రీతి నిగమ్ ముఖ్య పాత్రలు పోషించగా, అజయ్, సునీల్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

సుధీర్ చింటూ కథను అందించగా, లక్ష్మీ భూపాల డైలాగ్స్ అందించారు. శ్యామ్ తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమమౌతుంది.

First Published:  16 Feb 2024 5:07 PM GMT
Next Story