Telugu Global
Cinema & Entertainment

రాజేంద్రప్రసాద్ 'అనుకోని ప్రయాణం'

రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ పోషించిన తాజా చిత్రం అనుకోని ప్రయాణం. ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు రాజేంద్రుడు. తన కెరీర్ బెస్ట్ మూవీ అంటున్నాడు.

రాజేంద్రప్రసాద్ అనుకోని ప్రయాణం
X

రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ పోషించిన సినిమా 'అనుకోని ప్రయాణం'. ఈ సినిమా రిజల్ట్ పై చాలా టెన్షన్ గా ఉన్నానని ప్రకటించాడు రాజేంద్రప్రసాద్. తన కెరీర్ బెస్ట్ గా ఈ సినిమా నిలిచిపోతుందని, అందుకే ఈ సినిమా రిజల్ట్ పై టెన్షన్ పడుతున్నట్టు చెబుతున్నాడు.

"నా నట జీవితంలో చేసిన చిత్రాలలో ది బెస్ట్ 'అనుకోని ప్రయాణం'. కెరీర్ లో తొలిసారి ఒక సినిమా విషయంలో టెన్షన్ గా ఉన్నాను. 'అనుకోని ప్రయాణం' అద్భుతమైన కథ, మనసుకు ఎంతగానో నచ్చి నటించిన ఈ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ ఉంది. 'ఆ నలుగురు' సినిమా విడుదలైనప్పుడు కొంత టెన్షన్ పడ్డాను. ఆ సినిమా ట్రైలర్, పోస్టర్ లో నేను సీరియస్ గా కనిపిస్తే అందరూ కాస్త సర్ప్రైజ్ అయ్యారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉంటుందో చూపించే కథ అది. అందరూ నవ్వినవ్వి వంద రోజులు చూశారు. 'అనుకోని ప్రయాణం' కూడా అంత పెద్ద విజయాన్ని అందుకుంటుంది."

'అనుకోని ప్రయాణం' కరోనా సమయంలో ప్రాణానికి ప్రాణమైన ఇద్దరు స్నేహితులు మధ్య జరిగే అద్భుతమైన కథ. ఒరిస్సా నుండి రాజమండ్రి వరకు జరిగే ఒక 'అనుకోని ప్రయాణం' ఇందులో చూపించారు.

ట్రయిలర్ లో చూపించినట్టు ఇది బాధలు చూపించే సినిమా కాదని, గోలగోల చేసే సినిమా అని అంటున్నారు రాజేంద్రప్రసాద్. సినిమాలో రాజేంద్రప్రసాద్, నరసింహ రాజు స్నేహితులుగా నటించారు. అక్టోబర్ 28న థియేటర్లలోకి వస్తోంది అనుకోని ప్రయాణం.

First Published:  18 Oct 2022 3:25 AM GMT
Next Story