Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి, మహేష్‌ల మూవీకి స్క్రిప్ట్‌ రెడీ – ఇక మొదలుపెట్టడమే తరువాయి

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేజర్‌ అప్‌డేట్‌ని రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. మహేశ్‌ బాబుతో చేస్తున్న మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్టు ప్రకటించారు.

రాజమౌళి, మహేష్‌ల మూవీకి స్క్రిప్ట్‌ రెడీ – ఇక మొదలుపెట్టడమే తరువాయి
X

రాజమౌళి, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత రాజమౌళి రూపొందించనున్న ఈ చిత్రం ప్యాన్‌ వరల్డ్‌ రేంజిలో ఉంటుందన్న విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మహేష్‌బాబును సరికొత్తగా చూపించనున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేజర్‌ అప్‌డేట్‌ని రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ వెల్లడించారు. మహేశ్‌ బాబుతో చేస్తున్న మూవీకి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్టు ప్రకటించారు.

తాజాగా ఓ ఇంటర్వూ్యలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో మహేశ్‌ బాబు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతోంది. ఇక సినిమాను అధికారికంగా లాంచ్‌ చేసి, షూటింగ్‌ మొదలు పెట్టడమే ఆలస్యమని తెలుస్తోంది.

మరో విషయమేమంటే.. సంక్రాంతి తర్వాత మహేష్‌బాబు విదేశాలకు వెళ్లారని తెలుస్తోంది. మామూలుగా విహారయాత్రకు అయితే మహేష్‌బాబు కుటుంబంతో కలిసి వెళతారు. ఈసారి మాత్రం ఒంటరిగానే వెళ్లడం గమనార్హం.

రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన టెక్నికల్‌ అంశాలపై చర్చించేందుకే ఆయన విదేశాలకు వెళ్లారని ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. నాలుగైదు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొంటున్నారని తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియపై దృష్టిసారించినట్టు సమాచారం. ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత సినిమా వివరాలను రాజమౌళి స్వయంగా వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో మహేష్‌బాబు కనిపించనున్నారని రాజమౌళి ఇంతకుముందే వెల్లడించిన విషయం తెలిసిందే.

First Published:  20 Jan 2024 1:45 AM GMT
Next Story