Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu - కొత్త సినిమాకు సిద్ధమౌతున్న రాజమౌళి

Rajamouli Mahesh - వచ్చే నెల నుంచి మహేష్ బాబు సినిమాకు వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడు రాజమౌళి. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ నడుస్తోంది.

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్
X

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్

ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ నుంచి బయటకు రాబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనిమీదే అమెరికాలో ఉన్నాడు జక్కన్న. వచ్చే నెలతో ఆర్ఆర్ఆర్ హడావుడి పూర్తవుతుంది. ఆ వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహేష్ బాబుతో మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.

మహేష్ మూవీ ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఇప్పటికే చూచాయగా బయటపెట్టాడు జక్కన్న. ఇండియానా జోన్స్ సినిమా రేంజ్ లో, ప్రపంచం మొత్తం తిరిగేలా, ట్రెజర్ హంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని తెలిపాడు. ఈ కథపై ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ వర్క్ చేస్తున్నారు.

వచ్చే నెల నుంచి రాజమౌళి-విజయేంద్రప్రసాద్ కలిసి ఈ స్టోరీపై వర్క్ చేయబోతున్నారు. మరోవైపు మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో ఉంటాడు. ఎప్పటికప్పుడు ఆ సినిమా సెట్స్ లోనే మహేష్ ను కలవబోతున్నాడు రాజమౌళి. అలా మహేష్ ఇచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా కథను సిద్ధం చేసే పని స్టార్ట్ చేస్తాడు రాజమౌళి.

ముందు కథ సిద్ధమైన తర్వాత, ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి ఆ కథపై చర్చిస్తాడు రాజమౌళి. వాళ్లిచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు చేస్తాడు. ఆ తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. మహేష్ మూవీకి కూడా భారీగా సీజీ వర్క్ ఉంటుంది.

First Published:  15 Feb 2023 3:52 PM GMT
Next Story