Telugu Global
Cinema & Entertainment

Mahesh babu | రాజమౌళి-మహేష్ సినిమా ప్రకటన

Rajamouli Mahesh Babu Movie - రాజమౌళి, మహేష్ మూవీ ప్రీ-ప్రొడక్షన్ ఓ కొలిక్కి వచ్చింది. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు జక్కన్న.

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్
X

SS Rajamouli, Mahesh Babu: మహేష్ బాబు-రాజమౌళి సినిమాపై మరో గాసిప్

రాజమౌళి-మహేష్ బాబు సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ప్రకటన కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీ అధికారిక ప్రకటనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల్లోనే రాజమౌళి, మహేష్ తో సినిమాను ప్రకటించబోతున్నాడు.

రాజమౌళి ఓ సినిమాను ప్రకటిస్తూ, మీడియా ముందుకు వచ్చేముందు ప్రాజెక్టుకు సంబంధించి అప్పటికే మొత్తం సిద్ధం చేసి ఉంచుతాడు. నటీనటులతో పాటు, టెక్నీషియన్స్ అందర్నీ లాక్ చేసి పెడతాడు. ఈసారి కూడా అదే చేయబోతున్నాడు.

మహేష్ తో మూవీకి సంబంధించి మొత్తం రెడీ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి. మరికొన్ని రోజుల్లో అన్నీ సెట్ అయిపోతాయి. ఆ వెంటనే మీడియా సమావేశం పెడతాడు. అది కూడా హీరోతో పాటు కీలక సభ్యులందరితో ప్రెస్ మీట్ పెడతాడు.

ఆ రోజు కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, తన సినిమాకు సంబంధించి రాజమౌళి, మీడియాకు ఫుల్ క్లారిటీ ఇస్తాడు. అవసరమైతే స్టోరీ లైన్ కూడా ముందే చెప్పేస్తాడు. ఏదీ దాచే ప్రయత్నం చేయడు. ప్రస్తుతం ఈ సినిమాపై మార్కెట్లో చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. వాటన్నింటికీ ప్రెస్ మీట్ లో సమాధానాలు దొరికేస్తాయి. అందుకే అందరి చూపు ఈ ప్రెస్ మీట్ పై పడింది.

First Published:  21 Feb 2024 5:27 PM GMT
Next Story